Guntur District Police Office

మహిళా MLA ఫొటోస్ ని మార్ఫింగ్ చేసిన ముద్దాయిని అరెస్ట్ చేసిన గుంటూరు రూరల్ పోలీస్ టీం

0 Comments

ది. 24.07. 2019 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ జరుగు సందర్భంగా ఆరు మంది గౌరవ మహిళా MLA ల ఒక ఫోటోను ముద్దాయి పునుగుపాటి రమేష్ s/o వెంకటస్వామి , తన facebook లో గౌరవ మహిళా MLA ల ప్రతిష్టను పబ్లిక్ లో కించపరిచే విధంగా పెట్టినాడు. దీనిపై తుళ్లూరు P.S లో కేసు నమోదు చేయబడింది .
గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ శ్రీమతి R. జయలక్ష్మి , IPS , ఆదేశాల మేరకు గుంటూరు రూరల్ IT CORE CDR wing మరియు సిబ్బంది CID సైబర్ క్రైమ్ వింగ్ యొక్క సహాయం తీసుకుని ముద్దాయిని 13-08-2019 వ తేదీన అరెస్ట్ చేయటం జరిగినది .
Note : గుర్తు తెలియని వ్యక్తులు ఎలక్ట్రానిక్ పరికరములను ఉపయోగించి మహిళలను వేధించటం మరియు భయపెట్టి blackmail చేయు సందర్భాలలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP శ్రీ గౌతమ్ సవాంగ్, IPS గారు ఏర్పాటు చేసిన ” సైబర్ మిత్ర” ద్వారా టోల్ ఫ్రీ నెంబర్ 112 మరియు 181 అలాగే WHATSAPP నెంబర్ 9121211100 కు సమాచారం తెలిపిన యెడల వారి యొక్క ఫిర్యాదును త్వరగా పరిష్కరించబడును . అల తెలియపరచిన సమాచారాన్ని గోప్యముగా ఉంచెదరు. అదేవిధంగా facebook page ” AP POLICE WOMEN SAFETY CYBER SPACE ” ద్వారా కూడా మహిళలు వారి ఫిర్యాదులను తెలియపరచవచ్చు

Share Us